శ్రీరామనవమి ఎలా జరుపుకోవాలి? Way Of Celebrating SriRamaNavami
శ్రీరామనవమి అనగానే మి అసలు ఈ పండుగ ఎలా వచ్చింది? శ్రీరామనవమి ఎలా జరుపుకోవాలి?
శ్రీరామనవమిని ఎప్పుడు జరుపుకుంటాము?
ప్రతి సంవత్సరంలో చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే నవమి శ్రీరామనవమిగ మనం జరుపుకుంటాము. ఎందుకనగా త్రేత యుగంలో ఇదే కిదినాడు శ్రీరామచంద్రుడు దశరథ మహారాజు మరియు కౌశల్య తల్లికి జన్మించడం జరిగింది. అలాగే శ్రీరామనవమిడాడు ఆదిదంపతులైన సీతారాములకు జనక రాజ్యంలో పండితుల వేదాల సాక్షిగా వివాహం జరిగింది.
రాముడు ధర్మానికి రూపం అనగా ధర్మానికి ఒక శరీరం ఇస్తే ఆ శరీరం పేరే శ్రీ రామచంద్రుడు, విష్ణు భగవానుడు ప్రధానంగా పది అవతారాలను స్వీకరించారు అందులో చాలా ప్రధానమైన అవతారం శ్రీ రామ వతాలు ఎందుకనగా ఈ ఆవతారం లో విష్ణు భగవానుడు శ్రీరాముని రూపంలో మానవాళికి చాలా దగ్గరగా ఉంది అసలు ఒక మానవుడు ఎలా బ్రతకాలి ఎలా నడుచుకోవాలి అని చూపించారు. శ్రీ రామచంద్రుడు సత్యాన్ని ఆచరించి లోకాన్ని గెలిచారు ధర్మాన్ని ఆచరించి పెద్దల మెప్పు పొందారు గురువుల దగ్గర మంచి రాజయ్యా. రు. రాముడు అంటేనే ధర్మం రాముడంటేనే సత్యం ధర్మమంటేనే రాముడు.
శ్రీరామనవమి ఎలా జరుపుకోవాలి?
హిందువుల ప్రకారం శ్రీరామనవమి అనేది చాలా పెద్ద పండుగ కానీ ఈ శ్రీరామన వమి ధర్మబద్ధంగా వేదానుకులంగా ఎలా జరుపుకోవాలి?
1) ఉపవాసం : చాలామంది శ్రీరామనవమి నాడు కళ్యాణం జరిగే వరకూ ఉపవాసము ఉండడం జరుగుతుంది. అలాగే రాముల వారి కల్యాణమైపోయిన తర్వాత అన్నదానం జరిగే ప్రదేశాలలో కచ్చితంగా ప్రసాదం స్వీకరించాలని మన పెద్దలు చెప్పారు.
2) రామాయణం వినడం: శ్రీరామనవమినాడు రామాయణాన్ని విన్న చదివిన చాలా గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి. ఈనాడు రామాయణం వినడం లేదా చదవడం చేయడం ఉపయోగకరమని మన పెద్దలు చెప్పారు.
3) శ్రీరామ కళ్యాణం: శ్రీరామనవమి నాడు సీతారాముల కల్యాణంలో పాల్గొనడం కనీసంలో కనీసం కల్యాణాన్ని చూడడం చేస్తే 1000 అన్నదానాలు చేసిన లభిస్తుంది చేసిన పాపాలన్ని తొలగిపోతాయి ధర్మబద్ధంలో జీవితంలో నడిచే అవకాశం ఏర్పడుతుంది.
4) వడపప్పు పానకం: శ్రీరామ నవమి నాడు ప్రత్యేకంగా వడపప్పు మరియు పానకం మనకి మందిరాలలో ఇవ్వడం జరుగుతుంది అంతే కాక ఈరోజు ఇళ్లల్లో ఇవే పదార్థాలను శ్రీరాముడికి నైవేద్యంగా పెడతారు వైదిక పరంగా కూడా ఇది వేసవికాలం కావున వడపప్పు పానకం తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తుంది కావున శ్రీరామనవమి నాడు కచ్చితంగా వడపప్పు మరియు పానక సేవనం చేయాలి.
5) అన్నదానం: మన పెద్దలు అన్ని దానాల్లో కెల్లా మిన్న అన్నదానం అని అంటారు అదే అన్నదానాన్ని ఇలాంటి పరవపావనమైన రోజున మనకు ఆ దేవాలయం శ్రీ రాముని ఆశీస్సులు ఎల్లకాలం కలిగే ఉంటాయి. అలాగే ఈరోజు కళ్యాణంలో పాల్గొన్నారు చేసి తమ ఇళ్ళకి వెళ్లాలని మన పెద్దలు చెప్పారు.
శ్రీరామనవమి ఎలా జరుపుకోవాలిశ్రీరామనవమి ఎలా జరుపుకోవాలి?
ప్రతి పండుగకి తమ శక్తానుకూలంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక ధార్మికమైన కార్యక్రమాలు చేస్తే ఆ దేవాది దేవుడు ప్రసన్న ఇస్తాడు అలాగే మనిషికి బంధం రుణపడుతుంది వేసవికాలం కావున ఎవరి స్థాయికి తగ్గట్టు వారు విసనకర్రలు ఇవ్వటము చలివేంద్రాలు ఏర్పాటు చేయడము ఇలాంటి సర్కార్మలు చేస్తే చాలా మంచిది మన పెద్దలు చెప్పినట్టుగా మానవసేవయే మాధవసేవ.
ఎవరి పరిస్థితి అనుకూలంగా వారు కచ్చితంగా శ్రీరామనవమి రోజున రామల వారి కళ్యాణంలో పాల్గొనాలని పరిస్థితి వీలుకానందునచో కనీసం తమ కళ్ళతో శ్రీరామనవమి నాడు రాముల వారి కళ్యాణి చూస్తే చాలా మంచిది. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఆ రామచంద్రుని కృప మనందరినీ ఇలాగే కొనసాగాలని ఆశిస్తూ ప్రణామాలు